Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 71

Janaka narrates his family lineage !!

||om tat sat||

బాలకాండ
ఏకసప్తతితమ
( జనక మహారాజు మిథిలాధిపతుల వంశ చరిత్ర చెప్పుట)

 

ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః |
శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్ ||

స|| ఏవం బ్రువాణం ( వసిష్ఠం) జనకః కృతాంజలిః ప్రత్యువాచ | భద్రం తే | నః పరికీర్తితం కులం శ్రోతుమర్హసి ||

తా|| ఈవిథముగా పలికిన వానికి ( వసిష్ఠునికి) అంజలి ఘటించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "మీకు శుభమగు గాక . కీర్తిపొందిన మా వంశ చరిత్ర మీరు వినుదురు గాక ."

ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః |
వక్తవ్యం కులజాతేన తన్నిభోధ మహామునే ||

స|| హే మునిశ్రేష్ఠ ! కులజాతేన ప్రదానే నిరవశేషతః వక్తవ్యం హి ||

తా|| ఓ మునిశ్రేష్ఠ ! కులాధిపతి (కన్యా) దానమిచ్చునప్పుడు శేషములేకుండా (తన వంశ చరిత్రను) వ్యక్తపరచవలెను గదా.

రాజాభూత్ త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా |
నిమిః పరమ ధర్మాత్మా సర్వ సత్త్వవతాం వరః ||

స|| నిమిః పరమధర్మాత్మా త్రిషు స్వేన కర్మణా లోకేషు విశ్రుతః సర్వ సత్త్వవతాం వరః రాజా అభూత్ ||

తా|| పరమధరాత్ముడు మూడు లోకములలోనూ తన కార్యములచేత ప్రశిద్ధికెక్కినవాడు , బలముకలవారిలో బలిష్ఠుడు అగు నిమి మహారాజు ( మావంశమునకు ) మూలపురుషుడు.

తస్యపుత్త్రో మిధిర్నామా మిథిలా యేన నిర్మితా |
ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః ||

స|| తస్య పుత్రః మిథిః నామ | యేన మిథిలా నిర్మితః | ప్రథమో జనకః నామః | జనకాద్ అపి ఉదావసుః ||

తా|| అయన పుత్త్రుడు మిథి అను పేరుగలవాడు. అయన చేత మిథిలానగరము నిర్మించబడినది. ఆయన మొదటి జనకుడు అను పేరుగలవాడు. జనకునకు ఉదావసుడు కలిగెను.

ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః |
నందివర్ధన పుత్త్రస్తు సుకేతుర్నామ నామతః ||

స|| ఉదావసో జాతో ధర్మాత్మా నందివర్థనః | నందివర్థన పుత్త్రః సుకేతుః నామ నామతః తు ||

తా|| ఉదావసునకి పుట్టెను దర్మాత్ముడగు నందివర్థనుడు. నందివర్థనుని పుత్త్రుడు సుకేతుడు అని పేరు గలవాడు.

సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః |
దేవరాతస్య రాజర్షేః బృహద్రథ ఇతి స్మృతః ||

స|| సుకేతోః అపి ధర్మాత్మా మహాబలః దేవరాతః | దేవరాతస్య బృహద్రథః రాజర్షేః ఇతి స్మృతః ||

తా|| సుకేతునుకి ధర్మాత్ముడు మహాబలవంతుడు అగు దేవరాతుడు పుట్టెను. దేవరాతునకు రాజర్షి అగు బృహద్రధుడు కలిగెను.

బృహద్రథస్య శూరోsభూత్ మహావీరః ప్రతాపవాన్ |
మహావీరస్య ధృతిమాన్ సుధృతి స్సత్యవిక్రమః ||

స|| బృహుద్రధస్య మహావీరః శూరః మహాప్రతాపః అభూత్ | మహావీరస్య సుధృతి సత్యవిక్రమః ధృతిమాన్ అభూత్ ||

తా|| బృహద్రధునికి శూరుడు మహాప్రతాపము గల మహావీరుడు కలిగెను. మహావీరునకు సత్యము పాలించు సుధృతి అను సుతుడు పుట్టెను.

సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతు స్సుధార్మికః |
దృష్టకేతోస్తు రాజర్షేః హర్యశ్వ ఇతి విశ్రుతః ||

స||సుధృతేః అపి దృష్ఠకేతుః సుధార్మికః ధర్మాత్మా (అస్తు) | దృష్టకేతో హర్యస్వ రాజర్షేః ఇతి విశ్రుత ||

తా|| సుధృతి కి కుడా దృష్ఠకేతు అనబడు సుధార్మికుడు కలిగెను. దృష్ట కేతునకు రాజర్షి అగు హర్యస్వుడు కలిగెను.

హర్యశ్వస్య మరుః పుత్త్రో మరోః పుత్త్రః ప్రతింధకః |
ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథస్సుతః ||

స|| హర్యస్వస్య మరుః పుత్త్రః | మరోః పుత్త్రః ప్రతింధికః ||ప్రతింధికస్య రాజా కీర్తిరథః సుతః ధర్మాత్మా (అస్తు) ||

యా|| హర్యస్వుని పుత్త్రుడు మరు. మరుని పుత్రుడు ప్రతింధిక అనబడు వాడు. ప్రతింధకుని పుత్త్రుడు కీర్తిరథుడు అనబడువాడు||

పుత్త్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతిస్మృతః |
దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రకః ||

స|| కీర్తిరథస్య పుత్త్రః దేవమీఢః ఇతి స్మృతః | దేవమీఢస్య విబుధః |విబుధస్య మహీధ్రకః ||

తా|| కీర్తిరథుని పుత్త్రుడు దేవమీఢుడు. దేవమీఢునిపుత్రుడు విబుధుడు. విబుధుని పుత్రుడు మహీద్రకుడు.

మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః |
కీర్తిరాతస్య రాజర్షేః మహారోమా వ్యజాయత ||

స|| మహీధ్రక సుతః మహాబలః రాజా కీర్తిరాతో (అస్తు) | కీర్తిరాతస్య మహారోమా రాజర్షేః వ్యజాయత ||

స|| మహీద్రకుని పుత్రుడు మహాబలుడు అగు రాజా కీర్తిరాతుడు. కీర్తిరాతునికి రాజర్షి అగు మహారోముడు కలిగెను.

మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత |
స్వర్ణరోమస్తు రాజర్షేః హ్రస్వ రోమా వ్యజాయత ||

స|| మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత | స్వర్ణరోమస్తు హ్రస్వరోమా వ్యజాయత్ ||

తా|| మహారోముని పుత్రుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని పుత్రుడు హ్రస్వరోముడు.

తస్య పుత్త్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః |
జ్యేష్ఠో హమనుమజో భ్రాతా మమవీరః కుశద్వజః ||

స|| తస్త్య ధర్మజ్ఞస్య మహాత్మనః పుత్త్రద్వయం జజ్ఞే | అనుజో అహం జ్యేష్ఠః | మమభ్రాతా కుశధ్వజః ||
తా|| ఆ ధర్మజ్ఞుడికి ఇద్దరు పుత్త్రులు. అ అనుజులలో నేను జ్యేష్ఠుడను. నా తమ్ముడు కుశధ్వజుడు.

మాంతు జ్యేష్ఠం పితా రాజ్యే సోsభిషిచ్య నరాధిపః |
కుశధ్వజం సమావేస్య భారం మయి వనం గతః ||

స|| నరాధిపః పితా జ్యేష్ఠం మాం రాజ్యే అభిషిత్య కుశధ్వజం భారం సమావేశ్య వనం గతః ||

తా|| నరాధిపుడైన నా తండ్రి నాకు రాజ్యము పట్టాభిషేకము చేసి కుశధ్వజుని భారము అప్పగించి వనమునకు పోయెను.

వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్ |
భ్రాతరం దేవసంకాశం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజమ్ ||

స|| వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్ | భ్రాతరం కుశధ్వజం దేవసంకాశం స్నేహాత్ పశ్యన్ |

తా|| వృద్ధుడైన నాతండ్రి స్వర్గస్తులు అయినప్పుడు రాజ్యమును ధర్మబద్ధముగా చేయుచుంటిని. తమ్ముడగు అ కుశధ్వజుని స్నేహపూర్వకముగా చూచుచుంటిని.

కస్యచిత్త్వథ కాలస్య సాంకాశ్యాదగమత్ పురాత్ |
సుధన్వా వీర్యవాన్ రాజా మిథిలాం అవరోధకః ||

స|| అథ కస్యచిత్ కాలస్య సుధన్వా వీర్యవాన్ రాజా మిథిలాం పురాత్ అవరోధకః సాంకశ్యాత్ అగమత్ |

తా|| పిమ్మట కొంతకాలము తరువాత వీరుడగు సుధన్వుడు మిథిలానగరమునకు ప్రతిబంధకములు కలిగించుటకు సాంకశ్యనగరము నుంచి వచ్చెను.

స చ మే ప్రేషయామాస శైవం ధనురుత్తమమ్ |
సీతా కన్యా చ పద్మాక్షి మహ్యం వ దీయతాంమితి ||

స|| స మే శైవం ఉత్తమం ధను: పద్మాక్షీ సీతా మహ్యం దీయతాం వ ఇతి ప్రేషయామాస ||

తా|| అతడు నా ఉత్తమమైన శివ ధనస్సును , పద్మాక్షి అగు సీతను తనకి ఇవ్వమని వార్త పంపెను.

తస్యాప్రదానార్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ |
స హతోs భిముఖో రాజా సుధన్వాతు మయా రణే |

స|| హే బ్రహ్మర్షీ ! తస్య అప్రదానాత్ మయా సహ యుద్ధం ఆసీత్ | స రాజా సుధన్వతః మయా రణే అభిముఖః హతః |

తా|| ఓ బ్రహ్మర్షీ ! తనకి ఇవ్వని కారణమువలన నాతో యుద్ధమునకు వచ్చెను. ఆ రాజు యుద్ధములో నా ఎదుట రణములో చనిపోయెను.

నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్ |
సాంకాశ్యే భ్రాతరం వీరం అభ్యషించం కుశధ్వజమ్ ||

స|| హే మునిశ్రేష్ఠ ! తం నరాధిపం సుధన్వానం నిహత్య సాంకాశ్యే భ్రాతరం వీరం కుశధ్వజం అభ్యషించం ||

తా|| ఓ మునిశ్రేష్ఠ ! ఆ నరాధిపుడగు సుధన్వుని సంహరించి సాంకాశ్యనగరమునకు సోదరుడు వీరుడగు కుశ ధ్వజుని పట్టాభిషిక్తుని చేసితిని.

కనీయానేషమే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే |
దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుంగవ |
సీతాం రామభద్రాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ |||

స|| హే మహామునే ! ఏష భ్రాతా అహం జ్యేష్టః కనీయా | సీతాం రామభద్రాయ ఊర్మిళాం లక్ష్మణాయ చ దదామి | హే మునిపుంగవ భద్రంతే ||

తా|| ఓ మహామునీ ! ఇతడు నాతమ్ముడు. నేను పెద్దవాడిని. సీతను రామభద్రునకు ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. ఓ మునిపుంగవ మీకు మంగళమగు గాక .

వీర్య శుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమామ్|
ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్వదామి నసంశయః ||

స|| సురసుతోపమం వీర్యశుల్కాం మమ సుతాం ద్వితీయాం ఊర్మిళాం చైవ త్రిః వదామి న సంశయః ||

తా|| సురలతో సమానమగు వీర్య శుల్కమగు నాకూతురు సీతని , రెందవది ఊర్మిళను అని మూడు సార్లు చెప్పుచున్నాను. సందేహము లేదు.

రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ |
పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు |
మఖాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో ||
ఫల్గునా ముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు |
రామలక్ష్మణయోరాజన్ దానం కార్యం సుఖోదయమ్ ||

స|| హే రాజన్ రామలక్ష్మణయోః గోదానం కారయస్వ హ |తతః వైవాహికం పిత్రుకార్యం చ కురు | భద్రం తే | అద్య మఖః |ప్రభో మహాబాహో అద్య తృతీయే దివసే ఉత్తర ఫల్గునే తస్మిన్ వైవాహికం కురు || రాజన్ రామలక్ష్మణయోః సుఖోదయం దానం కార్యం కురు ||

తా|| "ఓ రాజన్ ! రామలక్ష్మణులచేత గోదాన క్రియను జరిపించుడు. తండ్రి వివాహమునకు సంభంధించిన చేయవలసిన కార్యములు కూడా చేయుడు. ఈ దినము మఖ నక్షత్రము. ఓ మహాబాహో మూడవ దినము ఉత్తర ఫల్గుణి. అందు వివాహము చేయుడు. రామలక్ష్మణుల సుఖము కొఱకు దానకర్మలను చేయుడు".

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకసప్తతితమ స్సర్గః ||

ఈ విధముగా దెబ్బది ఒకటవ సర్గ సమాప్తము

సమాప్తం ||

|| om tat sat ||